Moratorium Period No Interest of Loans to Covid-19 and the lockdown – రుణం పై మరటోరియం కాలానికి వర్తింపు చక్రవడ్డీ మాఫీ

Moratorium Period No Interest of Loans to Covid-19 and the lockdown – రుణం పై మరటోరియం కాలానికి వర్తింపు చక్రవడ్డీ మాఫీ

Moratorium Period No Interest of Loans to Covid-19 and the lockdown – రుణం పై మరటోరియం కాలానికి వర్తింపు చక్రవడ్డీ మాఫీ  : Central Government Agrees to Waive Interest on Interest On Loans Up to Rs 2 Crore to Covid-19 and the lockdown. Centre in Supreme Court agrees to waive compound interest on loans up to Rs 2 crore for 6 months. In a big relief to retail and MSME (Micro, Small and Medium Enterprises) borrowers who are facing hardship due to the impact of COVID-19 pandemic, the Centre on Friday told the Supreme Court that it has decided to ‘waive interest’ on loans of up to Rs 2 crore during the six-month moratorium period.

FA1 Question Papers 2024: Download (Updated)

Moratorium Period No Interest of Loans to Covid-19 and the lockdown – రుణం పై మరటోరియం కాలానికి వర్తింపు చక్రవడ్డీ మాఫీ

The RBI has announced a sixmonth moratorium on loans repayments from March, giving borrowers the option to postpone EMIs till August, to ease the financial stress on them due to Covid-19 and the lockdown. The loans were categorised into eight categories by the government including MSME (Micro, Small and Medium Enterprises), education, housing, consumer durable, credit card dues, auto, personal, and consumption.

  • మరటోరియం కాలానికి వర్తింపు చక్రవడ్డీ మాఫీ
  • రూ.2 కోట్లలోపు రుణం ఉన్నవారికి ఊరట
  • మరటోరియం కాలానికి వర్తింపు
  • సుప్రీం కోర్టుకు కేంద్రం ప్రమాణ పత్రం

కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తిగత రుణగ్రహీతలు, చిన్న-మధ్య తరగతి పరిశ్రమలకు కాస్త ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రుణాల చెల్లింపును వాయిదా వేసిన ఆరు నెలల కాలానికి చక్ర వడ్డీ (వడ్డీపై వడ్డీ) వసూలు చేయకూడదని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ దృష్ట్యా రుణాలు చెల్లింపుపై ఆరు నెలల పాటు మారటోరియం ప్రకటించడంతో ఆ సమయంలో చక్ర వడ్డీ వసూలు ఉండదు. రూ.2 కోట్లలోపు ఉన్న రుణాలకే ఇది వర్తిస్తుంది. మారిటోరియంవల్ల కలిగిన వెసులుబాటును ఉపయోగించుకున్నారా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా రుణగ్రహీతలు అందరికీ దీన్ని అమలు చేయనుంది. కేంద్ర ఆర్థిక శాఖ సుప్రీంకోర్టులో సమర్పించిన ప్రమాణ పత్రంలో ఈ విషయాన్ని పేర్కొంది. చక్రవడ్డీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. ఇందుకు అవసరమైన గ్రాంట్ల కోసం పార్లమెంటు ఆమోదం తీసుకోవాల్సి ఉందని వెల్లడించింది.

రుణాలపై మారిటోరియం విధించినందున, వడ్డీ మాఫీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారిస్తున్న జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ముందు ఈ ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. కరోనా కారణంగా మార్చి 1 నుంచి మే 31 వరకు మారటోరియం ప్రకటిస్తున్నామని, రుణాలు, వడ్డీలకు సంబంధించిన కిస్తీల చెల్లింపును వాయిదా వేసుకోవచ్చని పేర్కొంటూ మార్చి 27న RBI సర్క్యులర్‌ జారీ చేసింది. తరువాత ఈ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. వసూళ్లను వాయిదా వేయడం వల్ల భారమేమీ తగ్గదని, ఆ తరువాతైనా వడ్డీపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటూ  వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇది మరింత భారంగా మారుతుందని, అందువల్ల వడ్డీని మాఫీ చేయాలని పిటిషన్‌దారులు కోరారు.

దీనిపై తొలుత కేంద్రం సమాధానం ఇస్తూ వడ్డీ మాఫీ చేయడం ప్రాథమిక ఆర్థిక సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. దీనివల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. మారటోరియం అంటే వడ్డీ చెల్లింపును వాయిదా వేయడమే తప్పించి, వడ్డీని రద్దు చేయడం కాదని దీన్ని అర్థం చేసుకోవాలని కోరింది. వడ్డీలన్నీ మాఫీ చేయాలంటే రూ.6 లక్షల కోట్లు అవసరమవుతుందని, దాన్ని బ్యాంకులు భరించలేవని వివరించింది. ఇది వాటి మనుగడకే ముప్పు కలిగిస్తుందని తెలిపింది.

చక్రవడ్డీపై ఏంచేస్తారని ధర్మాసనం ప్రశ్నించడంతో సమాధానం చెప్పడానికి గడువు కావాలని గత నెల 29న కోరింది. ఆ మేరకు తాజా నిర్ణయాలతో ప్రమాణపత్రాన్ని సమర్పించింది. చక్రవడ్డీని రద్దు చేస్తే అది బ్యాంకులకు భారంగా మారనుందని, అందువల్ల దాన్ని ప్రభుత్వం భరించనుందని వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా నష్టపోయిన రంగాలకు ఇంతకుముందు చేసిన సాయానికి ఇది అదనమని పేర్కొంది. మారటోరియం కాలంలో చెల్లించని రుణాలను మొండి బకాయిలుగా పరిగణించబోరని, దివాలా నిబంధనలు కూడా వర్తించబోవని స్పష్టం చేసింది.

Terms applicable to 8 types of loans

  • Micro, Small and Medium Enterprises (MSMEs)
  • Education loan
  • Home loan
  • Purchase of items such as cell phones
  • Credit card arrears
  • Vehicles
  • Personal Loans
  • Other purchases

SBI Loans Extension EMI for 3 months COVID-19 Effect

Scroll to Top