JVK 4 Kits Distribution Guidelines 2023 Jagananna Vidya Kanuka Students Kits Supply Instructions to HM

JVK 4 Kits Distribution Guidelines 2023 Jagananna Vidya Kanuka Students Kits Supply Instructions to HM

JVK 4 Kits Distribution Guidelines 2023 Jagananna Vidya Kanuka Students Kits Supply Instructions to HM & MEO : How to JVK Kits Distributions RC No.SS-16021/50/2023-CMO SEC – SSA Date : 10/06/2023 Subject: Samagra Sikha ‘Jagannann Vidya Kanuka‘ from 2023-24 Mandal Resource Centers to School Complexes – Uniform Cloth, Supply of Shoes & Socks – Guidelines for CMO’s, Mandal Education Officers and School Complex Headmaster’s. R.C.No. SS-16021/50/2021-CMO SEC-SSA Date: 10-06.2023.

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

JVK 4 Kits Distribution Guidelines 2023 Jagananna Vidya Kanuka Students Kits Supply Instructions to HM & MEO

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్రశిక్షా ఆధ్వర్యంలో ‘జగనన్న విద్యా కాను పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం మండల రిసోర్సు కేంద్రాలకు చేరిన యూనిఫాం, బూట్లు & సాక్సులు, బ్యాగులు వంటి వాటిని చేరిన ఒకటి రెండు రోజుల్లో స్కూల్ కాంప్లెక్సులకు సరఫరా చేయవలసి ఉంటుంది.

  • మండల విద్యాశాఖాధికారులు తమ మండల రిసోర్సు కేంద్రానికి యూనిఫాం/ బూట్లు & సాక్సులు మరియు బ్యాగులు చేరిన ఒకట్రెండు రోజుల్లో స్కూల్ కాంప్లెక్సులకు చేర్చేలా ప్రణాళిక వేసుకోవాలి. నిర్ణీత తేదీలు కేటాయిస్తూ తమ పరిధిలోని స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులకు సమాచారం అందించాలి.
  • మండల విద్యాశాఖాధికారులు ‘జగనన్న విద్యాకానుక’ యాప్ లో పొందుపరిచిన సమాచారం మేరకు ఆయా స్కూల్ కాంప్లెక్సులకు చెందిన తరగతి వారీగా బాలబాలికలకు ఏయే వస్తువులు ఎన్నెన్ని ఇవ్వవలసి ఉంటుందో సరిచూసుకొని సరఫరా చేయాలి.’
  • ఎంఆర్సీ/ స్కూల్ కాంప్లెక్సులలో వస్తువులు పంపిణీ కోసం టేబుళ్లు, కుర్చీలు, డిస్ ప్లే బోర్డు, మార్కర్లు, స్టాప్లర్, శానిటైజర్, దుస్తులు కొలిచే టేపు/ స్కేలు వంటివి అవసరానికి అనుగుణంగా ఉపయోగించాలి.

ఎంఆర్సీల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు యూనిఫాం క్లాత్, బూట్లు & సాక్సులు మరియు బ్యాగుల సరఫరా విధానం

ఈ కార్యక్రమం అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమష్టి బాధ్యతగా భావించాలి.

ఆ) యూనిఫాం క్లాత్ సంబంధించి:

  • యూనిఫాం బేల్స్ రూపంలో ఉంటాయి. ఒక్కో బేల్ లో ఎన్నెన్ని ప్యాకెట్లు ఉంటాయో వాటిపై ముద్రించి ఉంటుంది. బాలికలవైతే ‘G’ అని బాలురవైతే ‘B’అని, దీంతోపాటు తరగతికి ఎదురుగా’ టిక్’ మార్క్ ఉంటాయి.
  • ఒకటి నుండి 5వ తరగతి బాలికలకు, అన్ని తరగతుల బాలురకు కేటాయించిన ప్యాకెట్లలో రెండు రకాల క్లాత్ పీసులు ఉంటాయి. 6-10 తరగతుల బాలికల ప్యాకెట్లలో 3 రకాల క్లాత్ పీసులు ఉంటాయి.
  • తరగతి వారీగా పర్టింగ్, సూటింగ్, చున్నీకి సంబంధించిన కొలతలు ప్యాకెట్ మీద ముద్రించి ఉంటాయి.
Class wise Uniform cloth measurements (Boys & Giirls)
తరగతి బాలురు బాలికలు
సూటింగ్ క్లాత్ షర్టింగ్ క్లాత్ సూటింగ్ క్లాత్ షర్టింగ్ క్లాత్ (టాప్ ) షర్టింగ్ క్లాత్ (బాటమ్ ) చున్నీ 
1 1.05 1.47 2.25 1.47
2 1.05 1.47 2.25 1.47
3 1.20 2.07 2.40 1.77
4 1.20 2.07 2.40 1.77
5 1.50 2.37 3.30 2.19
6 1.50 2.37 2.67 2.28 4.20
7 1.80 2.67 2.97 2.49 4.50
8 2.85 2.79 3.27 2.67 5.40
9 3.00 3.00 3.81 3.60 6.00
9* 3.00 4.95 6.27 5.94 6.00
10 3.30 3.09 4.20 3.81 6.00
10* 3.30 5.12 6.93 6.27 6.00
  • ఒక్కో తరగతికి చెందిన ఒక్కో బేల్ నుండి ఒక ప్యాకెట్ తీసుకొని పైన ఇచ్చిన పట్టిక ప్రకారం యూనిఫాం కొలతలు ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి.
  • మండల రిసోర్సు కేంద్రంలో సరఫరా కోసం కేటాయించిన ఒక గదిలో తరగతి వారీగా బాలుర యూనిఫాం, బాలికల యూనిఫాం విడివిడిగా పెట్టుకోవాలి.
  • ప్రతి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా బాలురు, బాలికలకు ఎన్నెన్ని యూనిఫాం ప్యాకెట్లు కావాలో తీసుకొని విడివిడిగా కవర్లలో పెట్టుకోవాలి. బాలురు, బాలికల యూనిఫాం వేర్వేరు గోనె సంచుల్లో వేసుకోవాలి.

Jagananna Vidya Kanuka App Download & Install link

బూట్లు & సాక్స్ సంబందించినవి

  • స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా, సైజులు వారీగా బాలురు, బాలికలకు ఎన్నెన్ని బూట్లు మరియు సాక్సులు కావాలో తీసుకొనివిడివిడిగా కవర్లలో పెట్టుకోవాలి. బాలురు, బాలికల బూట్లు మరియు సాక్సులు వేర్వేరు గోనె సంచుల్లో వేసుకోవాలి.
  • బాలబాలికలకు సంబంధించి బూట్లు సైజులకు అనుగుణంగా, సుమారుగా తీసుకెళ్లవలసిన సాక్సులు.

వివరాలు:

బాలురు బాలికలు
బూట్లు సైజెలు సాక్స్  సైజెలు బూట్లు సైజెలు సాక్స్  సైజెలు
కిడ్స్ సైజ్  : 8, 9, 10, 11, 12, 13 3 వ నంబర్ కిడ్స్ సైజ్  : 8, 9, 10, 11, 12, 13 3 వ నంబర్
1, 2, 3 4 వ నంబర్ 1, 2,3 4 వ నంబర్
4, 5, 6 5 వ నంబర్ 4, 5, 6 5 వ నంబర్
7, 8, 9, 10 6 వ నంబర్ 7, 8 6వ నంబర్

Note : బూట్లు, సాక్సులు ఏవైనా చినిగినవా, కుట్లు సరిగా ఉన్నాయా లేదా సరి చూసుకోవాలి.

జగనన్న విద్యాకానుక కిట్లలో ఉండవలసిన అంశములు

1. స్కూల్ బ్యాగ్,
2. పాఠ్య పుస్తకములు,
3. వ్రాత పుస్తకములు,
4. బెల్ట్‌,
5. బూట్లు,
6. స్కూల్ యూనిఫార్మ్,
7. సాక్స్.
8. డిక్షనరీ.

1,2,3,4,5,వ తరగతి బాలురకు

  • 3 జతల యూనిఫాం క్లాత్,
  • బ్యాగ్,
  • రెoడు వైపులా నవారు కలిగిన బెల్ట్ 80Cm,
  • ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు,
  • తరగతి పాఠ్య పుస్తకాలు,
  • English English Telugu Pictorial directory.

1,2,3,4,5వ తరగతి బాలికలకు

  • 3జతల యూనిఫాం క్లాత్,
  • బ్యాగ్,
  • కాటన్ క్లాత్ బెల్టు 80Cm,
  • ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు,
  • తరగతి పాఠ్య పుస్తకాలు,
  • English English Telugu Pictorial directory.

6,7,8,9,10వ తరగతి బాలురకు

  • 3జతల యూనిఫాం క్లాత్,
  • Large Size బ్యాగ్,
  • రెoడు వైపులా నవారు కలిగిన బెల్ట్ (For 6,7,8th Class – 90Cm) (9,10th – 100 Cm)
  • ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు,
  • తరగతి పాఠ్య పుస్తకాలు,
  • English English Telugu directory. (Only 6th Class)

6,7,8,9,10వ తరగతి బాలికలకు

  • 3 జతల యూనిఫాం క్లాత్,
  • Large Size బ్యాగ్,
  • కాటన్ క్లాత్ బెల్టు (For 6,7,8th Class – 90Cm)  (9, 10th – 100 Cm)
  • ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు,
  • తరగతి పాఠ్య పుస్తకాలు,
  • English English Telugu directory. (Only 6th Class)

బ్యాగులకు సంబంధించి:

ప్రతి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా, సైజులు వారీగా బాలురు, బాలికలకు ఎన్నెన్ని బ్యాగులు కావాలో తీసుకొని వేర్వేరు గోనె సంచుల్లో వేసుకోవాలి.

బాలికలకు స్కై బ్లూ రంగు, బాలురకు నేవీ బ్లూ రంగు బ్యాగులు తరగతుల వారీగా కింది ఇచ్చిన పట్టిక ప్రకారం తగిన సైజులు అందజేయాలి.

తరగతి బ్యాగ్ సైజు
1 నుంచి 5వ తరగతి చిన్న సైజు బ్యాగ్
6, 7 వ తరగతలు మీడియం సైజు బ్యాగ్
8, 9, 10 వ తరగతలు పెద్ద సైజు బ్యాగ్

Instructions for JVK Kits Distribution Guidelines 2023 to HM & MEO

స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బ్యాగు నందు డబుల్ జెప్పులు, షోల్డర్, డబుల్ రివిట్స్, షోల్డర్ స్టాప్ ఫోమ్, హ్యాండిల్, బ్యాగు ఇన్నర్ క్లాత్ మరియు కుట్లు సరిగా ఉన్నాయో లేవో నాణ్యతను సరి చూసుకోవాలి. 2 లేదా 3 టేల్ లోని బ్యాగులు తనిఖీ చేయాలి.

మీరు తీసుకోవలసిన వస్తువుల్లో ఏవైనా డ్యామేజ్ అయినా, సరిపడా సైజు లేకపోయినా, చినిగిపోయినా సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఆ వివరాలను ఎంఆర్సీ కేంద్రం/ స్కూల్ కాంప్లెక్స్ లో ఉంచిన స్టాకు రిజిస్టరులో నమోదు చేసి ఆ సమాచారాన్ని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారికి లేదా సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వారికి తెలియజేయాలి.

‘జగనన్న విద్యాకానుక’కు సంబంధించి అన్ని వస్తువులు మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు చేరిన తర్వాత భద్రపరిచే గదిలో వెలుతురు తగిలేలా, ఎలుకలు, చెదలు వంటివి లేకుండా తడి, చెమ్మ లేకుండా, వర్షం నీరు రాకుండా ఉండేలా భద్రతా ప్రమాణాలు పాటించాలి.

మండల రిసోర్సు కేంద్రాల నుండి స్కూల్ కాంప్లెక్సులకు వస్తువులను తరలించడానికి అయ్యే ఖర్చును. సంబంధిత స్కూల్ కాంప్లెక్సు నిధుల నుండి సమకూర్చుకోవాలి.

Helpline Number : ‘జగనన్న విద్యా కానుక’ వస్తువుల పంపిణీలో ఏవైనా సందేహాలు ఉన్న యెడల 9154294169 నంబరులో కార్యాలయపు పనివేళ్లలో సంప్రదించగలరు.

స్టాకు రిజిస్టర్ నిర్వహణ

  • ప్రతి జిల్లా కార్యాలయం / మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సు/ ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా
  • ‘జగనన్న విద్యా కానుక’ కు సంబంధించి ఇది వరకు సూచించిన విధంగా ఒక స్టాకు రిజిస్టరునునిర్వహించాలి.
  • మండల రిసోర్సు కేంద్రం నుంచి స్కూల్ కాంప్లెక్సులకు, అలాగే స్కూల్ కాంప్లెక్సుల నుండి పాఠశాలలకు వస్తువులను సరఫరా చేసిన తర్వాత స్టాకు వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.
  • రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులు సంబంధిత మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సు/ పాఠశాలకు తనిఖీ నిమిత్తం సందర్శించినప్పుడు స్టాకు రిజిస్టర్ తప్పనిసరిగా చూపించవలసి ఉంటుంది.

నమోదు

రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.

JVK Kits Distribution Guidelines Download

Scroll to Top