Jammu and Kashmir to be a union territory | Partition of Jammu and Kashmir

Jammu and Kashmir to be a union territory | Partition of Jammu and Kashmir

The President who approved the repeal of Article 370
Partition of Jammu and Kashmir బిగ్ బ్రేకింగ్ : ఆర్టికల్ 370 రద్దును ఆమోదించిన రాష్ట్రపతి. జమ్ము కశ్మీర్‌ విభజన

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Jammu and Kashmir to be a union territory | Partition of Jammu and Kashmir 

న్యూదిల్లీ: జమ్ము కశ్మీర్‌కు సంబంధించి కీలక పరిణామాలు వేగంగా చోటు చేసుకొన్నాయి. ఆర్టికల్‌ 370ను రద్దు , 35(ఏ) రద్దు , రాష్ట్ర విభజన అంశాలు ఏకకాలంలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అదే సమయంలో ఆర్టికల్‌370 రద్దు చేస్తూ రాష్ట్రపతి వెనువెంటనే ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో భారతరాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఆర్టికల్‌ 370(3)తో జమ్ముకశ్మీర్‌ లెజిస్లేటీవ్‌ అసెంబ్లీగా మారుతుంది. దీంతో జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీలో బిల్లులు రాష్ట్రపతి అమోదానికి పంపించే అవకాశం ఏర్పడింది.

Jammu and Kashmir to be a union territory | Partition of Jammu and Kashmir

రాష్ట్ర విభజన..

జమ్ము, కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలను విడదీశారు. వీటిల్లో జమ్ము, కశ్మీర్‌లు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుకాగా.. లద్దాక్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు.

జమ్ము కశ్మీర్‌ను దేశంతో అనుసంధానించాం: అమిత్‌ షా

జమ్ము కశ్మీర్‌ను తాము మిగిలిన దేశంతో అనుసంధానించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. భారత రాజ్యాంగం మొత్తం జమ్ము కశ్మీర్‌లో అమలవుతుంది.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
HM Amit Shah: Jammu and Kashmir to be a union territory with legislature and Ladakh to be union territory without legislature.

కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ, కశ్మీర్, లడఖ్

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ ముఖ చిత్రం మారిపోయింది. కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ, కశ్మీర్, లడఖ్ ఏర్పడ్డాయి. దీంతో జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన జరిగిపోయింది. దీనిపై రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. పార్లమెంట్‌లో చేసిన ప్రతి చట్టం ఇకపై జమ్మూలో అమలు కానుంది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ, కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది.

Scroll to Top