How to Conduct Election Duties 2024 | After Polling filling & Submit Forms Covers List Download

How to Conduct Election Duties 2024 | After Polling filling & Submit Forms Covers List Download

How to Conduct Election Duties 2024 | After Polling filling & Submit Forms Covers List Download

How to Conduct Election Duties 2024 | After Polling filling & Submit Forms Covers list in Telugu. How to Connect EVM, Ballet Unit, VVPAT, and Control Unit? How to Conduct Mock Poll in Telugu? Polling Officers’ Duties Before/ Polling Day/ After Polling in Elections 2019 in Telugu. OP Duties, APO Duties, and Other Polling Officers’ duties download in Telugu. OPO / 1st polling officer duty in Telugu 2nd polling officer duty 2024 first polling officer duty video Download.

FA1 Question Papers 2024: Download (Updated)

How to Conduct Election Duties 2024 | After Polling filling & Submit Forms Covers list Download

ఎన్నికల విధులు – MOCK POLL PROCESS

1. How to Connect EVM’s

         BU  ➡️  VVPAT  ➡️CU

2. VVPAT వెనుక గల black knob ని నిలువుగా పెట్టాలి.
3. CU లో POWER ON చేయాలి (CU, VSDU, VVPAT లో గ్రీన్ లైట్ & 7 SLIPS పడటం గమనించాలి).
4. CU & VSDU ల display లో సందేశాలు గమనించాలి.
5. TOTAL బటన్ press చేయాలి.
6. C U లో polled votes zero చూపిస్తుంది(ఒకవేళ zero కాకుండా కొన్నిసార్లు polled ఓట్లు చూపితే CRC చేయాలి).
7. PRESS BALLOT(CU, VSDUలలో Busy&BU లో Ready గ్రీన్ లైట్స్ వస్తాయి).
ఒకవేళ INVALID(అంటే జీరో తో Close ఐయింది) వస్తే CRC లో RC చేయాలి.
8. BALLOT జారీ చేస్తూ 50 ఓట్లు MOCK POLL చేయాలి(నోటా కి కూడా VOTES వేయాలి).
9. PRESS CLOSE.
10. PRESS BALLOT

(INVALID అంటే మళ్లీ ఓటు వేయలేము అని ఏజెంట్స్ కి చెప్పాలి).

11. PRESS RESULT
(Candidate wise గా ఏజెంట్స్ కి చూపాలి).
12. PRESS CLEAR (1నుండి NOTA వరకు zeros ఏజెంట్స్ కి చూపాలి).
13. Power Off CU.
14. OPEN VVPAT drop box(50+7)slips collect.
15. VVPAT 50 SLIPS RESULT ని CU RESULT తో సరి పోల్చి చూపండి.
16. ఖాళీ Drop box

ఏజెంట్స్ కి చూపించి Address tag తో 2 seals చేయండి.

17. CU ని కూడా 4( green, spl. tag, A- B-C-D Strip &address tag) Seals తో సీల్ చేయండి.
18. VVPAT 57 Slips కి వెనుక mock poll రబ్బర్ స్టాంప్ వేసి black కవర్లో ఉంచి, plastic కంటైనర్లో pink సీల్ వేసి PO,MO, P agents sign తో భద్రపరచాలి.
19. Mock Poll సర్టిఫికెట్స్ పూర్తి చేసి ఏజెంట్స్ సంతకం తీసుకోవాలి.
20. సరిగ్గా ఉదయం7AM కి CU లో POWER ON చేసి,CU, VSDU గ్రీన్ లైట్స్ &VVPAT లో 7 స్లిప్స్ పడడం గమనించి

REAL POLL ప్రారంభించాలి.

21. ప్రతీ 2 గంటలకు ఒకసారి TOTAL PRESS చేసి polled అయిన votes 17 C లో రాసుకోవాలి.
22. Acctual Poll ముగిసిన అనంతరం CLOSE బటన్ నొక్కండి.
23. CU POWER OFF చేసి,Cables remove చేయండి.
24.EVM s ని సంబంధిత cases లో పెట్టి address tags తో seals చేయాలి.
25. Imp 4 forms లలో ఏజెంట్స్ తో sign తీసుకోండి &17 C form నింపి ఏజెంట్స్ కి ఇవ్వండి.

➥ Elections Duty Employees TA & DA Rates Download
➥ How to Conduct Assembly & Parliament Election Videos in Telugu
➥ Polling Duties Before/ Polling Day/ After Polling in Elections 2024

ప్రిసైడింగ్ అధికారులకు కొన్ని సూచనలు.

పోలింగ్ రోజున ముఖ్య భూమిక పోషించేవ్యక్తి ప్రిసైడింగ్ ఆఫీసరు.
P0 గా నియామకం పొందగానే రెండు శిక్షణా తరగతులకు తప్పక హజరై చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకోవాలి.
ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చిన Hand book లోని అంశాలను చదివి అర్ధంచేసుకోవాలి.
పోలింగ్ ముందు రోజున ఉదయాన్నే డిస్ట్రీబ్యూషన్ సెంటరుకు (పంపకాల కేంద్రం) చేరుకోవాలి. R0, S0లను కలవాలి.
ర్యాండమైజేషన్ ద్వారా మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ ఉన్న గ్రామం, PS పేరు, నెంబరు వివరాలు తెలుసుకోవాలి.
మీ పోలింగ్ స్టేషన్ కు అలాట్ కాబడిన OPOs, Micro observer, web casting వారిని కలవండి.
డిస్ట్రిబ్యూషన్ సెంటరు (పంపకాల కేంద్రం)లో సిబ్బందితో పాటు వెళ్ళి పోలింగ్ మేటీరియల్ తీసుకోండి.

Elections Duty Employees TA & DA Rates Download

మెటీరియల్

(1) EVMs including VVPAT,
(2) అన్ని రకాల ఓటరు ట్యాగులు, స్ట్రీప్ సీళ్ళు, పేపరు సీళ్ళు,
(3) ప్రిసైడింగ్ ఆఫిసర్ డిక్లరేషన్, ప్రిసైడింగ్ అధికారి డైరి,
(4) బ్యాలట్ పేపర్లు (For tenderd votes)
(5) Marked Copies of electorols,
(6) Form 17A
(7) voter slips
(8) ఇండెలిబుల్ ఇంక్
మొ॥ చాలా ముఖ్యమైనవని గ్రహించండి.
(9) సామాగ్రి, రికార్డులు, సర్టిఫికేట్లు.

ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి. మీరు తీసుకొన్న EVMs, పేపరు సీళ్ళు, ఓటర్ల జాబితా మొ॥ వాటి S.Nos, మీ పోలింగ్ స్టేషన్ కు చెందినవా? కాదా? అని Check చేయండి.
మీ PS వి కాకపోయినా, Damage జరిగివున్నా, Shortfall ఉన్నా S.Nos సక్రమంగా లేకపోయినా R0 దృష్టికి తీసుకు వెళ్ళండి.
ఆ పై రూటు ఆఫీసరు, Sectoral officer, Security తో, ఎన్నికల వాహనంలో PS ను చేరుకోండి.
మీరు, సిబ్బంది ఎట్టి పరిస్థితులలోనూ PSలోనే రాత్రికి ఉండండి.
రాత్రే polling Compartments లోకసభకు, ఏర్పాటు చేసుకోండి
పోలింగ్ కు అనుకూలంగా కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేసుకోండి.
పోలింగ్ అధికారులకు విధులు కేటాయించండి.
పోటీలో వున్న అభ్యర్ధుల జాబితా 7A ను,
PS పరిధి, ఓటర్ల సంఖ్య తెలుపు పోస్టరులను PS ప్రవేశ ద్వారం వద్ద (బయట) ప్రదర్శనకు ఉంచండి.
PS వద్ద భద్రతా ఏర్పాట్లు చూసుకోండి.
ఉదయాన్నే 7 గంటలకు పోలింగ్ మొదలు కావాలి.
పోలింగ్ ఏజంట్ల నియామకం చేయండి.

Mock Poll నిర్వహించండి

  1. Mock poll గురించి డిక్లరేషన్ మరువవద్దు.
  2. Mock Poll తర్వాత CRC చేసి EVM లను Reset చేయడం మారువవద్దు
  3. కంట్రోల్ యూనిట్ లో, స్పెషల్ అడ్రస్ ట్యాగ్ లు, అడ్రస్ ట్యాగులు, గ్రీన్ పేపరు సీళ్ళు, స్ట్రీప్ సీళ్ళు మొదలైనవి బిగించండి.
  4. బ్యాటరీ గురించి ఆలోచన వద్దు.
  5. BUలు, VVPATs కంపార్ట్ మెంట్ లో ఉంచి, CU తో అనుసంధానం చేయండి.
  6. ఓటర్లు క్యూలో ఉండేలాగున చూడండి.
  7. పోలింగ్ ప్రారంభించండి.
  8. EVMs మొరాయిస్తే వెంటనే SO కు తెలియచేయండి.
  9. సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ గురించి చర్యలు తీసుకోండి.

Duties of Polling Officers

మొదటి పోలింగ్ అధికారి

అధికారి మార్క్ డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్‌ కు బాధ్యుడు.
ఇతను ఓటరు తెచ్చిన ఓటరు స్లిప్ ప్రకారం పేరు, SNo బిగ్గరగా చదవాలి.
పురుష ఓటర్ల పేరు కింద underline చేయాలి, స్ర్తీ ఓటర్ల పేరు కింద under line చేసి, SNo వద్ద టిక్ పెట్టాలి. Transgender తే under line చేసి SNo వద్ద ✔ చేసి, TJ అని రాయాలి

2 వ అధికారి

ఓటర్ల రిజిస్టరు (17 A) లో ఓటరు సంతకం / వేలిముద్ర తీసుకొని, ఓటరు తెచ్చిన గుర్తింపు కార్డులోని చివరి ఆరు/ నాలుగు అంకెలను వ్రాయాలి.
ఇతనే ఎడమ చూపుడువేలుపై నిలువుగీతను / గుర్తును చెరగని సిరాతో పెట్టాలి.

మూడన అధికారి

ఓటరు స్లీప్స్ ఇస్తాడు. (ఓటరు స్లిప్ పై 17A లో ఓటరు క్రమసంఖ్య & ఓటరు జాబితాలోని ఓటరు క్రమసంఖ్య రాసి, పొట్టి సంతకం చేసి ఇవ్వాలి)

నాలగవ అధికారి

లోకసభ కంట్రోల్ యూనిట్‌కు భాద్యుడు.
ఇతను ఓటరు తెచ్చిన తెలుపు తెలుపు స్లిప్ తీసుకొని CU లో ఓటు రిలిజ్ చేస్తాడని ఓటరు స్లిప్ లు జాగ్రత్త పరచాలి.

గుడ్డివారు, వికలాంగుల కోరికపై companian (సహయకుడు) ని నియమించాలి.

సహయకుని వద్ద PO hand bookలో చూపిన విధంగా డిక్లరేషన్ తీసుకోండి. ఆ వివరాలను Form 14 A లో వ్రాయండి.
17 A లో సంతకం చేసిన తరువాత, ఓటు వేయనని నిరాకరించిన వారి కొరకు 17 A రిమార్కుల కాలంలో ఓటు వేయటానికి నిరాకరించినారని వ్రాయండి.
CU లో ఓటు రిలీజ్ అయిన తరువాత ఏం చేయాలో Po hand book chapter No 23 చూడండి.

టెండర్ ఓటు గురించి తెలుసుకోండి

ఒకరి ఓటును మరొకరు వేసివుంటే, చిన్న విచారణ అక్కడికక్కడే చేసి, నిజమైతే టెండర్ బ్యాలట్ పేపరు వెనుక Tenderd ballot అని వ్రాయండి.
ఓటు వేయటానికి క్రాస్ రబ్బరు స్టాంపు ఇవ్వండి. వివరాలను 17E లో వ్రాయాలి. ఇలాంటివి 20 కన్నా ఎక్కువ ఉండరాదు.

ఛాలెంజ్ ఓటు గురించి

మొదటి పోలింగ్ అధికారి వద్ద ఓటరు ఐడెంటిపైనే పోలింగ్ ఏజంట్లు సందేహం వ్యక్తం చేస్తే po, ఓటరు తెచ్చిన ఐడెంటి కార్డుతో ఓటర్ల జాబితాతో సరిచూడాలి.
నిజమైతే ఓటుకు అనుమతి ఇవ్వాలి. కాకపోతే police లకు complaint ఇవ్వాలి.

Important Instructions to PO

  • ప్రతి రెండు గంటల కొకమారు, మార్క్ డ్ కాపీ ఆఫ్ ఎలెక్టోరల్ తోను, ఓటర్ల స్లిప్స్ తోనూ, CU లో పోలైన ఓట్లతోను సరిచూడలి. ప్రతిగంట/రెండు గంటలకు ఎన్ని ఓట్లు పొలైనాయో S0 కు తెలియచేయాలి
  • సిక్రెసీ ఆఫ్ ఓటింగ్ గురించి మరువవద్దు.
  • సాయంత్రం 5 గంటల తరువాత కూడా వరుసలో ఓటర్లువుంటే, చివరి వ్యక్తికి ఒకటో నెంబరు స్లిప్స్, మొదటి వ్యక్తికి చివరి నెంబరు ఇవ్వండి.
  • చివరి వ్యక్తి ఓటు వేయగానే CU ఒక సారి Total no of Votes poll ను చూసి నమోదు చేసుకొని CUలో close బటన్ నొక్కండి.
  • VVPAT నాబ్ ను Transport (lock) Position లో ఉంచండి
  • PS తలుపులు మూయండి.
  • 17A లో చివరి S.No దగ్గర కిందుగా అడ్డంగా గీత గీయండి. ఇలా గీస్తే మరలా Enter చేయటానికి వీలుకాదు.
  • P0 డిక్లరేషన్ వ్రాయండి.
  • P0 డైరీ వ్రాయండి.అందులో ప్రతికాలమ్ ను జాగ్రత్తగా వ్రాయాలి.తొందరపడవద్దు.
  • EVMs సీలు చేయండి.

రిసెప్సన్ సెంటరులో క్రిందివి తప్పనిసరిగా ఇవ్వాలి.

(1) EVMs.
(2) Paper Seal Accounts.
(3) presiding officer Declaration.
(4) presiding officer Dairy.
(5) Staff acquittance rolls. (most probably s.o may take care of it.)
(6). Mock Poll Certificate
Pockets to be hand over in Reception centre.

పాకెట్ నెం 1

(a) మార్క్ డ్ కాపీస్ ఓటర్ల జాబితా సీల్డ్ కవరు.
(b) ఓటర్ల రిజిస్టరు ( 17 A) sealed cover.
(c) HOP,APLA ఓటర్ల స్లిప్స్ వేరు వేరుగా ఉంచి సీలు చేసిన కవరు.
(d) unused tenderd ballot papers.
(e) used tenderd ballot papers with Form 17 B Seald cover.

పాకెట్ నెం 2.

(a) మార్క్ చేయబడని ఓటర్ల జాబితా.సీల్డ్ కవరు.
(b) పోలింగ్ ఏజంట్ల నియామకాలు చేసిన ఫారాలు. (ఫారం – 10.) సీల్డ్ కవర్.
(c) 12 B, EDC సీల్డ్ కవరు.
(d) ఫారం – 14 సీల్డ్ కవరు. ఛాలెంజ్డ్ ఓట్ల గురించి.
(e) అంధుల, వికలాంగుల గురించివున్న Form 14 A, & companian declaratiమంగళగిర cover.
(f) ఓటర్ల వయస్సు గురించి తీసుకొన్న డిక్లరేషన్.Seald cover.
(g) ఛాలెంజ్ ఓట్లకు ఉన్న, ఇచ్చిన రశీదులు, వసూలైన డబ్బు వున్న కవరు.
(h) వాడని (unused) చెడిపోయిన (damaged) పేపరు సీళ్ళు.
(i) వాడని ఓటరు స్లిప్పుల కవరు.
( j ) వాడని చెడిపోయిన Strip Seals Cover.

పాకెట్ నెం 3.

(1) presiding officer hand book.
(2) Manual of electronics Machins.
(3) చెరగని సిరా and cup
(4) stamp Pad.
(5) brass seal of PO ?
(6) రబ్బరు స్టాంపులు (crossed).

పాకెట్ 4

ఓటర్ల వయస్సు సంబంధించిన డిక్లరేషన్లు, సంచులు, వస్త్రం,
RO చెప్పిన ఇతర పత్రాలు.
ఈ కవర్ల మీదనియోజకవర్గం పేరు,
ని॥వ॥ నెంబరు,
PS కేంద్రం పేరు,
PS నెంబరు వ్రాయండి.

అంతా సిద్ధమైన తరువాత SO, Route officer, Escort తో ఇచ్చిన వాహనంలో ఆహ్వాన కేంద్రానికి (రిసెప్సన్ సెంటరుకు) రండి.
ఆహ్వానకేంద్రంలో క్యూలో వెళ్ళి అన్ని రికార్డులు, EVMs, ఇతర సామాగ్రి ఇచ్చి రశీదు పొందండి.
చివరిగా ప్రిసైడింగ్ ఆఫీసరు ధైర్యంగా, డైనమిక్ గా, తెలివిగా ప్రవర్తిస్తే పోలింగ్ సులభంగా జరిగిపోతుంది.

Download Polling Conduct Activities 2024   (Telugu)

Scroll to Top