How to Apply Municipal Teachers Request Transfers – Points Allotment details
AP Municipal Teachers Transfers 2018-19 Guidelines, Schedule, Seniority list, Web Options and How to Apply Municipal Teachers Request Transfers – Points Allotment details Download.మున్సిపపాధ్యాయుల బదిలీల సమాచారం 10.01.19 తేదీలతో జి .ఓ. 507ని సవరణ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం వున్న నిబంధనల ప్రకారం ది. 30.6.18 నాటికి ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో రెండు సంవత్సరాలు పూర్తి చేసిన ఉపాధ్యాయులు బదిలీకొరకు ధరఖాస్తు చేయడానికి అర్హులు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
How to Apply Municipal Teachers Request Transfers – Points Allotment details
ఇవి రిక్వెస్టు బదిలీలు మాత్రమే.
1) 30.6.18 నాటికి ఉద్యోగ విరమణ కాలం 2సం|| లోపు వున్న వారికి బదిలీ ఐచ్చికం.
2) ప్రస్తుతం పనిచేస్తున్న మున్సిపాలిటీలో గాని, జిల్లాలో వున్న మరొక మున్సిపాటలిటీకి గాని బదిలీ కోరుకోవచ్చు. అలాగే పనిచేస్తున్న కార్పొరేషన్లో గాని, జిల్లాలో మరొక కార్పొరేషన్ కి గాని బదిలీ కోరుకోవచ్చు. మున్సిపాలిటి టు మున్సిపాలిటి, కార్పొరేషన్ కు కార్పొరేషన్ కు మాత్రమే బదిలీ జరుగును.
3) యన్.సి.సి. అధికారులుగా పనిచేయుచున్న వారిని యన్.సి.సి. యూనిట్ ఉన్న పాఠశాలకు మాత్రమే బదిలీ చేస్తారు.
పాయింట్లు How to Know Transfers Points
a) పనిచేసిన సర్వీసు కాలానికి, పాఠశాలలో పనిచేసిన కాలానికి 1సం|| కి 0.5 పాయింట్లు కేటాయిస్తారు.
b) రాష్ట్ర స్థాయి లేక జాతీయ స్థాయి అవార్డు పొందిన వారికి అదనంగా 3 పాయింట్లు కేటాయిస్తారు.
c) వారి పిల్లలు మున్సిపల్ లేక జిల్లా పరిషత్ లేక మండల పరిషత్ లేక ఎయిడెడ్ పాఠశాలలో గత 2సం|| చదివి ఉంటే వారికి 2 పాయింట్లు కేటాయిస్తారు.
d) ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పనిచేస్తున్న వారికి 5 పాయింట్లు అదనం.
e) అవివాహిత మహిళలకు 4 పాయింట్లు అదనం.
f) గత 8 సం|| లలో ఏదైనా క్రమ శిక్షణ చర్యలకు గురై ఉంటే 3 పాయింట్లు, మేజర్ చర్యలకు గురైతే 5 పాయింట్లు చొప్పున తగ్గిస్తారు.
g) స్పౌజ్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న లేక ప్రభుత్వరంగ, స్థానిక, ఎయిడెడ్ సంస్థలలో జిల్లా పరిధిలో గానీ లేక వెలుపలగాని పనిచేస్తున్నవారికి 4 పాయింట్లు.
h) యస్.యస్.సి. 2017-18 లో 100% ఉత్తీర్ణత పొందిన సంబంధిత సబ్జెక్టు వారికి 2 పాయింట్లు అదనం.
i) ఒక వేళ ఇద్దరికీ లేక అంత కన్నా ఎక్కువ మందికి సమానమైన ప్రాధాన్యత పాయింట్లు వచ్చినపుడూ అంగవైకల్యం ఉన్నవారికి టై అయితే ఆర్టో, విజువల్, చెవుడు ప్రాధాన్యత క్రమం తీసుకొంటారు. అలాగే మిగిలిన వారికి పుట్టిన తేదీని పరిగణలోనికి తీసుకొని సీనియారిటీని లెక్కిస్తారు.
j) ప్రిఫరెన్షియల్ కేటగిరీ -వరుస క్రమం ఆర్థోపెడిక్ విజువల్ వైకల్యం, చెవుడు, వితంతువులు, చట్టబద్ధంగా విడాకులు పొందిన మహిళలు క్రింది వ్యాధులతో స్వయంగా గాని లేక వారి పై ఆధారపడిన వారు గాని భాదపడుతుంటే క్రింది వరుసలో ప్రాధాన్యత ఉంటుంది. క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఎముకల టి.బి., మూత్రపిండాల మార్పిడి / డయాలసిస్, మానసిక వ్యాదికి వైద్యం తీసుకొంటున్న తల్లి/తండ్రి/స్పౌజ్/పిల్లలు కలిగిన వారికి, గుండెలో రంద్రాలు ఉన్న చిన్న పిల్లల గల వారికి, జువైనల్ డయాబెటిక్ ఉన్న చిన్న పిల్లలు గల వారికి (జిల్లా మెడికల్ బోర్డు నుండి ధృవీకరణ ఉండాలి).
ధరఖాస్తు చేయు విధానం
1) www.cdma.ap.gov.in వెబ్ సైట్లో Transfer-2018 Phase-II నింపాలి.
2) అన్ లైన్ దరఖాస్తు నింపిన తరువాత ఒక యూనిక్ రిజిష్టర్ నెంబర్ జనరేట్ అవుతుంది (URN).
3) URN జనరేట్ కాకముందే ఒకసారి దరఖాస్తులోని వివరాలను సరిచూసుకొని సబ్మిట్ చేయాలి. URN జనరేట్ అయిన తరువాత ఎడిట్ ఆప్షన్ లేదు.
4) ఆన్ లైన్ సబ్ మిట్ అయిన తరువాత మీ దరఖాస్తు PDF ఫార్మాట్లో సేవ్ అవుతుంది. PDF పార్మట్ ను ప్రింట్ తీసుకొని ఏదైన ప్రాధన్యత ధృవీకరణ పత్రాలతో కలిపి మున్సిపల్ కమీషనర్ కు ఇవ్వాలి.
బదిలీల షెడ్యూల్
1) 17.1.2019 నుండి 19.1.2019 వరకు (3 days)ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలి.
2) 20.1.19 నుండి 21.1.2019 (2 days) వరకు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆర్.డి.యమ్.ఎ.కు పంపాలి.
3) 22.1.19 నుండి 24.1.2019 వరకు (3 days) ఆర్.డి.యమ్. ఎ. వారి చేత చివరి లిస్టు ఖరారు.
4) 25.1.19 నుండి ఖాళీల ప్రకటన.
5) 25.1.19 ప్రధానోపాధ్యాయుల కౌన్సిలింగ్.
6) 27.1.19 స్కూల్ అసిస్టెంట్ కౌన్సిలింగ్ .
7) 28.1.19 భాషా పండితులు పి.ఇ.టి లకు
8) 29.1.19 యస్.జి.టి. తత్సమాన కేడర్లు.
9) 30.1.19 నుండి 31.1.19 వరకు Issue of Proceedings.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
AP Municipal Teachers Transfers 2018-19 Guidelines, Schedule, Seniority list, Web Options Municipal Teachers Request Transfers Official link