Grama secretaries Biometric attendance Guidelines 2020 | సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు

Grama secretaries Biometric attendance Guidelines 2020 | సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు

సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు, Biometric attendance at Grama secretaries. Grama secretaries Biometric attendance Guidelines 2020 | సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు.
సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల హాజరు నమోదు కోసం బయోమెట్రిక్ పరికరాలను ఉపయోగించనున్నారు . సచివా లయాల పరిధిలో పని చేస్తున్న వున్న గ్రామ , వార్డు వలంటీర్ల హాజరును కూడా ఈ పరికరాల ద్వారానే రోజు వారీ నమోదు చేయనున్నారు . సచివాలయ ఉద్యోగులకు మాత్రం రోజుకు నాలుగు దఫాలుగా హాజరు నమోదు చేయనున్నారు . ఉదయం డ్యూటీలో చేరే సమయంలో ఒకసారి , సాయంకాలం డ్యూటీ దిగే సమయంలో రెండో సారి నమోదు చేయనున్నారు . అదే విధంగా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రెండు సార్లు నమోదు చేయ నున్నారు . వలంటీర్లకు మాత్రం సచివాలయంలో హాజరయినప్పుడు , వెళ్ళేటప్పుడు రెండు దఫాలు నమోదు చేయనున్నారు . ఇప్పటికే వలంటీర్లందరి వేలిముద్రలను సాఫ్ట్వేర్ లో నిక్షిప్తం చేశారు . సచివాలయ ఉద్యోగులకు నాలుగు పర్యాయాలు హాజరు నమోదు చేయడంతో పూర్తి కాలం ప్రజలకు అందు బాటులో వుండేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది .

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Grama secretaries Biometric attendance Guidelines 2020 | సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు   

        

రోజు వారీ హాజరు పర్యవేక్షణ ఇలా 

సచివాలయ ఉద్యోగుల హాజరు నమోదును బయోమెట్రిక్ ద్వారా చేయడమే కాకుండా దాన్ని పర్యవేక్షించడానికి కూడా ఒక యాపను సిద్ధం చేశారంటు న్నారు . సచివాలయాన్ని పర్యవేక్షించే కార్యదర్శుల వద్ద ఈ యాపు అందుబాటులోకి తేనున్నారు . ఉదయం నుంచి ఉద్యోగులు ఎవరెవరు , ఎన్ని గంటలకు హాజరమతున్నారనే విషయం ఈ యాప్లో స్కోలింగ్ రూపంలో నిరంతరాయంగా వెల్లడవు తుందని తెలిసింది . అదేవిధంగా జిల్లాస్థాయిలో కూడా ఏ సచివాలయాలో ఏయే ఉద్యోగులు అందు బాటులో వున్నారనే విషయం ఇదే విధమైన స్కోలింగ్ ద్వారా తెలిసేలా యాపు రూపొందించి నట్లు చెబుతున్నారు.

బయో మెట్రిక్ తోనే సమావేశాల హాజరు 

సచివాలయ ఉద్యోగులు , వలంటీర్లతో అధి కారులు జరిపే సమావేశాలన్నీ ఇక మీదట బయో మెట్రిక్ నమోదు ద్వారానే నిర్వహించేందుకు యోచిస్తున్నారు . ఒక్కో మండలంలో సరాసరిన కనీసం 250 మంది వలంటీర్లు , 150 మంది సచివాలయ ఉద్యోగులు వుంటారు . మండల స్థాయిలో వీరందరి తోనూ జరిపే సమావేశాల్లో సంతకాల ద్వారా హాజరు తీసుకోవడం సమస్యగా వుంది . మహిళా వలంటీర్ల బదులుగా కుటుంబ సభ్యులు హాజరవు తున్నా గుర్తించలేని పరిస్థితి నెలకొంది . ఈ గందర గోళాన్ని నివారించేందుకు ఇక మీదట ఏ సమావేశం జరిగినా బయోమెట్రిక్ ద్వారా మాత్రమే హాజరు తీసుకునే విధంగా ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం .


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top