20 లక్షల మంది లబ్దిదారుల గుర్తింపు
40 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా
‘ఎల్ఐసీ’ నుంచి రుణం తీసుకోవాలనుకుంటున్న ప్రభుత్వం
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి కార్యాచరణ
రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటివరకు 20 లక్షల మంది లబ్దిదారులను గుర్తించారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాల కోసం 40 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. అయితే ప్రభుత్వ భూమి సుమారు 22 వేల ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉండడంతో 18 వేల ఎకరాల ప్రైవేటు భూమి కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
ప్రైవేటు భూముల కొనుగోలుకు రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల ఖర్చవుతుందని అంచనా. భూమి కొనుగోలు కోసం రుణం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ద్వారా రుణం తీసుకోవాలని యోచిస్తున్నారు. రూ.10 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.