Facilitation Center Guidelines for voting Postal Ballot 2024
Facilitation Center Guidelines for voting Postal Ballot 2024 | ఫెసిలిటేషన్ సెంటరు లో ఓటు వేయబోయే Postal ballot గురించిన సమాచారం | పోస్టల్ బ్యాలెట్‌కు రంగం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా మే 4, 5, 6, 7 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించే 23 వేలమంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంది. Facilitation Center Guidelines for voting Postal Ballot
2019 ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ప్రణాళికా లోపం కారణంగా గందరగోళంగా మారాయి. కేంద్రంలో తోపులాటలు, గొడవలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ జిల్లాలో ఈసారి ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం భావిస్తోంది. Facilitation Center Guidelines for voting Postal Ballot, Connecting EVM, VVPAT Video 2024.
పోస్టల్ బ్యాలెట్ పరిధిలోకి వచ్చేవారు ఎవ్వరు …?
పోస్టల్ బ్యాలెట్ పరిధిలోకి వచ్చేవారు – ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి, అధికారి, బ్యాలెట్ పరిధిలోకి వస్తారు. వీరంతా కొనుగోలు బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 23 వేలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సమయంలో విధులు నిర్వహించే వారు 13వేల పైచిలుకు ఉంటారు. వీరిలో ప్రధానంగా, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, విద్య, వైద్యం, మునిసిపల్, పోలీసు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉంటారు. ఈసారి ఆర్టీసీ ఉద్యోగులంతా, బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఎన్నికల నిర్వాహణలో ఉండే ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియా ప్రతినిథులకూ పంప్ బ్యాలెట్ వినియోగించుకునే వీలు కల్పించారు.
ఫామ్-12 డీ సమర్పించిన వారికి ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక గుర్తింపు పత్రాన్ని ఇస్తుంది – ఎన్నికల సంఘం ఇచ్చే ధ్రువీకరణ పత్రం చూపాలి
- ఎనికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఈ ఫామ్-12 డీ సమర్పిచేందుకు ఈ నెల 26 వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది.
- ఫామ్-12 డీ సమర్పించిన వారికి ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక గుర్తింపు పత్రాన్ని ఇస్తుంది.
- దీనితో పాటు ఓటరు ఐడీ, ఆధార్ కార్డు తమ వెంట తీసుకుని పోస్టల్ బ్యాలెట్ కేంద్రానికి వెళితే.. అక్కడ వివరాలు నమోదు చేసుకుని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సీల్డ్ కవర్‌తో కూడిన పోస్టల్ బ్యాలెట్‌లను ఇస్తారు.
- వాటిని తీసుకుని రహస్య ప్రదేశంలో ఓటు వేసిన తర్వాత తిరిగి వాటినికవరులో పెట్టి సీల్ వేసి పోస్టల్ బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది.
- అది ముగిసిన తర్వాత పోలీసు బందోబస్తు మధ్య సంబంధింత అసెంబ్లీ నియోజకవర్గాల రిసెప్షన్ సెంటర్లలో స్ర్టాంగ్ రూమ్‌ల్లో వాటిని భద్రపరుస్తారు.
Facilitation Center Guidelines for voting Postal Ballot 2024 | Discussing About Form 13A,13B,13C,13D
13A(Form – A) (డిక్లరేషన్)
13B(Form – B) (చిన్న కవర్)
13C (Form -C) (పెద్ద కవర్) Ballot paper
13D అంటే సూచనలు.( మన కోసం) పై నాలుగు confuse గా వుంటే, simple Trick గుర్తు పెట్టుకోండి.
13A(Form -A)
- ఇది పేపర్ రూపం లో వుంటుంది.దీని మీద మన డీటెయిల్స్ అండ్ Gazetted officer signature చేయించాలి.
NOTE: గెజిటెడ్ ఆఫీసర్స్ అక్కడే ఉంటారు
13B (Form – B)
- అంటే ఇది ఎన్వలప్ కవర్, Envelop cover కి Form – B అని పేరు అంతే, ఇది చిన్న కవర్.
- దీని మీద Ballot Paper సీరియల్ రాయాలి, (వాళ్ళే రాసి ఇస్తారు,) Ballot పేపర్ మీద మనం అనుకున్న టిక్ మార్క్ పెట్టీ చిన్న కవర్లో (Form -B)పెట్టీ సీల్ చేయాలి.
13C (Form – C)
- ఇది పెద్ద కవర్ అన్నమాట, దీనికి ఫామ్-C అని పేరు అంతే కానీ, ఇది కవర్ మాత్రమే.
- దీనిమీద మాత్రం మీ సిగ్నేచర్ మరియు అసెంబ్లీ/ పార్లమెంట్ ఎది ఐతే అది రాయాలి.
చివరి ఘట్టం
- ఫస్ట్ ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్(A), మరియు ballot పెట్టీ సీల్ చేసిన చిన్నకవర్(B),
రెండింటినీ పెద్ద కవర్(Form -C) లో పెట్టీ సీల్ చేసి box లో వేయాలి. అంతే సింపుల్. - ఎవరు కంగారు పడవద్దు,తెలియకపోతే అక్కడ మన facilitation centre PO /APO లు .మిమ్మల్ని గైడ్ చేస్తారు.