Exemption from election duties for Special Employees in Panchayat Elections

Exemption from election duties for Special Employees in Panchayat Elections 2021 : Exemption from election duties for pregnant and postpartum women in connection with panchayat elections in AP. In view of the health problems of the employees participating in the elections duty, the State Electoral Officer today issued their orders seeking exemption from election duty for the paralyzed (disabled), pregnant / postpartum and chronically ill employees. Order No.293 / SEC-B2 / 2021 dated 6.2.2021 sent to all District Collectors of the State as given below.

FA1 Question Papers 2024: Download (Updated)

Exemption from election duties for Special Employees in Panchayat Elections

  • ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గర్భిణులు, బాలింతలకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు.
  • కొవిడ్‌ దృష్ట్యా 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకూ మినహాయింపు.
  • ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Exemption from election duties for Special Employees in Panchayat Elections
Exemption from election duties for Special Employees in Panchayat Elections

ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగుల ఆరోగ్య ఇబ్బందులు దృష్టి లో వుంచుకొని దివ్యాoగులు (వికలాంగులకు), గర్భిణీ/బాలింతలకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే ఉద్యోగులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వమని కోరగా నేడు రాష్ట్ర ఎన్నిక అధికారి గారు వారి ఉత్తర్వులు Lr. No.293/SEC-బి2/2021 తేదీ 6.2.2021 ద్వారా ఈ క్రింద తెలిపిన విధంగా ఆదేశాలను రాష్ట్రంలోని అన్నీ జిల్లా కలెక్టర్లకు పంపడమైనది.

1 . కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండాలంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి 3.30 వరకు కాకుండా, గతంలో మాదిరిగా ఉదయం 6.30 గంటల నుండి 1.30 గంటలకే పూర్తి చేయాలని కోరగా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మరియు కోరుకున్న వివిధ జిల్లా కలెక్టర్ల అభ్యర్ధన మేరకు, నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో/ గ్రామాలలో మాత్రం పోలింగ్ మధ్యాహ్నం 1.30 ని: లకు పూర్తి చేయాలని, మిగిలిన అన్ని చోట్ల 3.30 గ: ల వరకు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ ఆదేశాలు ఇవ్వడమైనది.

2 . అలాగే గర్భిణీ, బాలింతలు గా ఉన్న ఉద్యోగినులకు ఎన్నికల విదులనుండి మినహాయింపు.

3 . అలాగే దివ్యాoగ (వికలాంగులు) ఉద్యోగులకు ఎన్నికల డ్యూటీలనుండి మినహాయింపు..

4 . ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని, 50 సంవత్సరాలు దాటి దీర్ఘకాలిక వ్యాధులు (అనగా గుండె, కిడ్నీ, కాన్సర్ లాంటి) తో బాధపడే ఉద్యోగులను ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు ఇవ్వడమైనది.

Download PO APO OPO Duties

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top