AP Students Bus New Charges 2019 | New bus passes from September 1st, 2019

AP Students Bus New Charges 2019 | New bus passes from September 1st, 2019

RTC has decided to rural students traveling on Bus up to 50 km from their homes.New buspass fares announced New bus passes from September 1st, 2019. కొత్త బస్‌పాస్ ఛార్జీల ధరలు ఖరారు | సెప్టెంబర్ 1 నుంచి కొత్త బస్ పాస్ లు. So far, the range of buses is 35 km. With the latest decision, it has increased to 50 kilometers. Monthly/ 3 Months/ Yearly New buspass fares / Charges. Monthly fare up to 40 km, Monthly fare up to 50 km in Rupees. AP గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తమ ఇంటి నుంచి 50 కి.మీ వరకు ప్రయాణించేలా బస్‌పాస్‌లు జారీ చేయాలని ఆర్టీసీ నిర్ణయించగా.. తాజాగా ఛార్జీలను ఖరారు చేశారు.
➥ 40 కి.మీ వరకు నెలపాస్ ఛార్జీని రూ.320, మూడునెలల పాస్‌కు రూ.960, సంవత్సరం బస్‌పాస్‌ ఛార్జీని రూ.3200గా నిర్ణయించింది
➥ ఇక 50 కి.మీ వరకు అయితే నెలపాస్ రూ. 420, మూడు నెలలపాస్‌కు రూ.1200, ఏడాది పాస్‌కు రూ.4,200గా నిర్ణయించారు.

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

AP Students Bus New Charges 2019 | New bus passes from September 1st, 2019

AP Students Bus New Charges 2019 | New bus passes from September 1st, 2019

విద్యార్థులకు గుడ్ న్యూస్ : సెప్టెంబర్ 1 నుంచి కొత్త బస్ పాస్ లు

గ్రామీణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. వారికి కొత్త బస్ పాస్ లు ఇవ్వనుంది. ఈ పాస్ లతో ఇకపై 50 కిమీ వరకు జర్నీ చేయొచ్చు. బస్ పాస్ ల చార్జీలను ఏపీఎస్ ఆర్టీసీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 1 నుంచి బస్ పాస్ లు అందుబాటులోకి వస్తాయి. అన్ని రంగాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించేందుకు సీఎం జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా విద్యార్థులకు శుభవార్త అందించింది. ఆర్ధిక భారం పడకుండా చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు ఇచ్చే రాయితీ బస్‌పాస్ పరిధిని పెంచింది. రాయితీ బస్‌పాస్ కిలోమీటర్ల పరిధిని 35 నుంచి 50 కిలోమీటర్లకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో గ్రామీణ స్కూల్, కాలేజీ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

  1. ఇప్పటి వరకు బస్‌పాస్‌ల పరిధి 35 కిలోమీటర్లు ఉండేది. తాజా నిర్ణయంతో అది 50 కిలోమీటర్లకు పెరిగింది. స్కూల్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఈ నిర్ణయం ఊరట ఇచ్చింది. 
  2. 35 కిలోమీటర్లు దాటి వెళ్లే విద్యార్థులకు బస్‌పాస్‌లు అర్హత లేకుండా పోయింది. 35 కిలోమీటర్ల పరిధి నిబంధనతో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ సమస్య ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో సానుకూలంగా స్పందించి పరిధిని పెంచింది. 
  3. రాష్ట్రవ్యాప్తంగా 660 విద్యాసంస్థలు 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థుల కష్టాలను గమనించిన జగన్ ప్రభుత్వం.. రాయితీ బస్‌పాస్‌ల కిలోమీటర్ల పరిధిని 35 నుంచి 50 కిలోమీటర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
  4. ఈ నిర్ణయంతో 15 వేల మంది విద్యార్థులు బస్‌పాస్‌లు పొందనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి 18.50 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top