Ananda Vedika Level wise Activities on 19th August, 2019 | Level 1,2,3 and 4 Class 1 to 10th
Ananda Vedika Level wise Activities on 19th August, 2019 | Level 1,2,3 and 4 for Primary Tsudents, Upper Primary Students and High School Students Ananda Vedika Activities download. Dr Manohar Rao Prepared Ananda Vedika Level wise Activities Download. 1-2-3-4 లెవెల్స్ వారు ఈక్రింది విధంగా కథాకార్యక్రమాన్ని అనుసరించాలి ఆనందవేదిక లో, పైన ఇచ్చిన సూచనలు పాటిస్తూ..ఆటలంతా ఆనందంగా..పాటలంతా కమణీయంగా జరిపే బాధ్యత ఉపాధ్యాయునిదే! ముందుగా 3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Ananda Vedika Level wise Activities on 19th August, 2019 | Level 1,2,3 and 4 Class 1 to 10th
ఆనంద వేదిక లెవెల్ 1 & 2, తేదీ 19.8.19 కార్యక్రమం
ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా సోమవారం అనగా మొదటిరోజు నిర్దేశించిన అరగంట సమయం లో మొదటి 3 నిమిషములు శ్వాస మీద ధ్యాస నిలిపే ప్రక్రియ చేయించాలి. ఉచ్చ్వాస నిశ్వాసల మీద పిల్లల దృష్టిని నిమగ్నం చేయించాలి. ఇలా చేయించే సందర్భంలో పిల్లలు సుఖంగా కూర్చోవాలి. ముద్రలు ఆసనములు వంటివి చేయనవసరం లేదు. 3 నిమిషములు శ్వాస మీద ధ్యాస అనంతరం పిల్లలకు ఈ వారం వినడం పై ఏకాగ్రత అనే ప్రక్రియను సాధన చేయించాలి. పిల్లలను మౌనంగా కూర్చోమని వారి చుట్టూ శబ్దములను వినమని ఆ శబ్దము లపై ఏకాగ్రత వహించమని తెలియజేయాలి. ఇలా ఐదు నిమిషాలు నిర్వహించిన తరువాత పిల్లలు విన్న శబ్దాలను గురించి చర్చించాలి.పిల్లలకు మాట్లాడే అవకాశం ఇచ్చి అందరు పిల్లలు మాట్లాడేలా ప్రోత్సహించాలి. ఇలా అందరి పిల్లల అభిప్రాయాలను క్రోడీకరించాలి. పిల్లలను శ్రద్ధగా వినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడించాలి. శ్రద్ధగా వింటే నేర్చుకున్న పాఠాలు బాగా వస్తాయి అనే విషయం చెప్పాలి. చివరి 2 నిమిషాలు మౌన ప్రక్రియ ద్వారా ఈరోజు కార్యక్రమం ముగించాలి.
ధన్యవాదములు. -ఆనందవేదిక టీమ్.
II.1. ఏకాగ్రతతో వినడం
సమయం : 25 నిమిషాలు నుండి 30 నిమిషాలు
ఉద్దేశ్యం :
విద్యార్థులు పరిసరాల ధ్వనుల పట్ల ఏకాగ్రత కలిగి ఉండి వాటిని గమనించడం.
శ్వాస మీద ధ్యాస :
• ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోమనాలి.
• రెండు లేదా మూడుసార్లు సామాన్య శ్వాసలు విడిచిపెట్టాక దీర్ఘమైన పొడవాటి శ్వాసలు తీసుకోమనాలి.
కార్యాచరణ సోపానాలు :
• విద్యార్థులు ప్రశాంతంగా కూర్చొని పరిసరాల నుండి వచ్చే ధ్వనులను వినమనాలి,
• విద్యార్థులందరూ కళ్ళుమూసుకొని కూర్చోవాలి. పరిసరాల నుండి వచ్చే ధ్వనులను వినమనాలి. ఎవరికైనా కళ్ళుమూసుకోవడంలో ఇబ్బంది కలిగితే వారు క్రిందివైపు చూస్తూ కూర్చోమనాలి. కళ్ళు మూసుకున్న తర్వాత తరగతిలోకి వచ్చు విభిన్న ధ్వనులు వినమనాలి.
ఉదాహరణ : ఫ్యాను, ట్రాఫిక్, బయటవారి మాటలు, పిల్లల నవ్వులు, అల్లరి, శబ్దాలు మొదలైనవి.
• తమ ఏకాగ్రతను పరిసరాల నుంచి వచ్చు ధ్వనులపై నిలపాలి. వచ్చే ధ్వనులు మంచివైనా, చెడువైనా ఏదైనా వినాలని చెప్పాలి.
• ఎవరికైనా ఏకాగ్రత భంగం కలిగితే తిరిగి ధ్వనులను వినమనాలి. ఈ విధంగా 1-2 నిమిషాల పాటు విన్న తర్వాత ఈ క్రింది అంశాలపై చర్చ జరగాలి.
ఉపాధ్యాయుడు విద్యార్థులతో చర్చించవలసిన అంశాలు:
• మీరు ఏ ఏ ధ్వనులపై ఏకాగ్రత నిలపడానికి ప్రయత్నం చేస్తారు ?
• మీరు ఏదైనా ఒక ధ్వనిపై ఏకాగ్రత నిలిపారా ?
• మీరు ఆ ధ్వని వినడంలో ఏకాగ్రత భంగం కలిగిందా ?
• తిరిగి ఏకాగ్రతగా వినగలిగారా ?
• మనం ఏ ఏ సమయంలో వినే ప్రయత్నం చేస్తాము ?
• ఈ ప్రక్రియ అభ్యసించడం వలన మనకి ఏమీ లాభం కలుగుతుంది ?
• ఎప్పుడైనా మనం ప్రశాంతంగా కూర్చొని రకరకాల ధ్వనులపై ఏకాగ్రత నిలపాలని ప్రయత్నించినప్పుడు
సామాన్యంగా వినిపించే ధ్వనుల కంటే ఎక్కువ ధ్వనులు మనం వినగలుగుతున్నామా ?
గుర్తుంచుకోవలసిన అంశాలు:
• తమ పరిసరాల ధ్వనుల పట్ల ఏకాగ్రత కలిగి ఉండాలి.
• తద్వారా విద్యార్థుల ధ్యాసను ధ్యానం వైపు మళ్ళించవచ్చు.
• ఉపాధ్యాయుడు ఏకాగ్రతగా ఈ కృత్యంలో నిమగ్నమైనప్పుడే విద్యార్థులు కూడా చేయగలరు.
మౌన ప్రక్రియ :
• 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యాన ప్రక్రియ కొనసాగించాలి.
• ఈ ప్రక్రియను మీ కుటుంబ సభ్యులతో కలసి చేయమనాలి.
ఆనంద వేదిక లెవెల్ 3, తేదీ 19.8.19 కార్యక్రమం
ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా సోమవారం అనగా మొదటిరోజు నిర్దేశించిన అరగంట సమయం లో మొదటి 3 నిమిషములు శ్వాస మీద ధ్యాస నిలిపే ప్రక్రియ చేయించాలి. ఉచ్చ్వాస నిశ్వాసల మీద పిల్లల దృష్టిని నిమగ్నం చేయించాలి. ఇలా చేయించే సందర్భంలో పిల్లలు సుఖంగా కూర్చోవాలి. ముద్రలు ఆసనములు వంటివి చేయనవసరం లేదు. 3 నిమిషములు శ్వాస మీద ధ్యాస అనంతరం పిల్లలకు ఈ వారం వినడం పై ఏకాగ్రత అనే ప్రక్రియను సాధన చేయించాలి. పిల్లలను మౌనంగా కూర్చోమని వారి చుట్టూ శబ్దములను వినమని ఆ శబ్దము లపై ఏకాగ్రత వహించమని తెలియజేయాలి. ఇలా ఐదు నిమిషాలు నిర్వహించిన తరువాత పిల్లలు విన్న శబ్దాలను గురించి చర్చించాలి.పిల్లలకు మాట్లాడే అవకాశం ఇచ్చి అందరు పిల్లలు మాట్లాడేలా ప్రోత్సహించాలి. ఇలా అందరి పిల్లల అభిప్రాయాలను క్రోడీకరించాలి. పిల్లలను శ్రద్ధగా వినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడించాలి. శ్రద్ధగా వింటే నేర్చుకున్న పాఠాలు బాగా వస్తాయి అనే విషయం చెప్పాలి. చివరి 2 నిమిషాలు మౌన ప్రక్రియ ద్వారా ఈరోజు కార్యక్రమం ముగించాలి.
ధన్యవాదములు -ఆనందవేదిక టీమ్.
ఏకాగ్రతతో వినడం
సమయం : 25 నిమిషాలు నుండి 30 నిమిషాలు
ఉద్దేశ్యం :
విద్యార్థులు పరిసరాల ధ్వనుల పట్ల ఏకాగ్రత కలిగి ఉండి వాటిని గమనించడం.
➤శ్వాస మీద ధ్యాస :
• ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోమనాలి.
• శ్వాస మీద ధ్యాస కేంద్రీకృతం కాదు. మరలా మరలా శ్వాస మీద ధ్యాసను కేంద్రీకరించాలి.
కార్యాచరణ సోపానాలు :
• విద్యార్థులు ప్రశాంతంగా కూర్చొని పరిసరాల నుండి వచ్చే ధ్వనులను వినమనాలి.
• విద్యార్థులందరూ కళ్ళుమూసుకొని కూర్చోవాలి. పరిసరాల నుండి వచ్చే ధ్వనులను వినమనాలి. ఎవరికైనా కళ్ళు మూసుకోవడంలో ఇబ్బంది కలిగితే వారు క్రిందివైపు చూస్తూ కూర్చోమనాలి. కళ్ళు మూసుకున్న తర్వాత తరగతిలోకి వచ్చు విభిన్న ధ్వనులు విసమనాలి.
ఉదాహరణ : ఫ్యాను, ట్రాఫిక్, బయటవారి మాటలు, పిల్లల నవ్వులు, అల్లరి శబ్దాలు ప్రకృతి నుండివచ్చే శబ్దాలు మొదలైనవి.
• తమ ఏకాగ్రతను పరిసరాల నుంచి వచ్చు ధ్వనులపై నిలపాలి. వచ్చే ధ్వనులు మంచివైనా, చెడువైనా ఏదైనా వినాలని చెప్పాలి.
ఉపాధ్యాయుడు విద్యార్థులతో చర్చించవలసిన అంశాలు :
• ఈ ప్రక్రియ చేసే సందర్భంలో మీ అనుభవాలేమిటి ?
• మీరు మీ శ్వాస ధ్వనిని వినగలిగారా ?
• ఈ ప్రక్రియ చేయడం మనకు సులభంగానే అన్పించిందా ?
• ఎవరికైనా ఏకాగ్రత అంతరాయం కల్గిందా ?
గుర్తుంచుకోవలసిన అంశాలు:
• తమ పరిసరాల ధ్వనుల పట్ల ఏకాగ్రత నిలపాలి. తద్వారా విద్యార్థుల ధ్యాసను వినడంవైపు మళ్ళించవచ్చు.
మౌన ప్రక్రియ:
• మీరు ఏ ఏ ధ్వనులు విన్నారు ?
• 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యాన ప్రక్రియ కొనసాగించాలి.
• విద్యార్థులు కళ్ళు మూసుకుని ఉంటారా లేక కళ్ళు తెరచి క్రిందికి చూస్తారా అనేది వారి వారి ఇష్టానికి వదిలేయాలి. ఈ ప్రక్రియను మీ కుటుంబ సభ్యులతో కలసి చేయమనాలి.
ఆనంద వేదిక లెవెల్ 4, తేదీ 19.8.19 కార్యక్రమం
లెవెల్ ఫోర్ 9 యు 10 తరగతుల విద్యార్థులకు ఈ వారం నిర్దేశించుకున్న ఆనందవేదిక కార్యక్రమాలలో సోమవారం నాటి కార్యక్రమాల వివరాలు.
ఈ వారంలో మనం భావోద్వేగాల నిర్వహణ అనే కౌశలమునకు సంబంధించి భావోద్వేగాన్ని నియంత్రించే తీరు అనే ఉప కౌశలం గురించి పిల్లలకు నేర్పించాలి. ముందుగా 3 నిమిషములు మైండ్ ఫుల్ నెస్ ఆక్టివిటీస్ శ్వాస మీద ధ్యాస లేదా ఏకాగ్రత సాధన ప్రక్రియ నిర్వహించాలి. తరువాత ఇరవై ఐదు నిమిషములలో నిర్దేశించుకున్న ఉప కౌశలానికి సంబంధించిన సంఘటన ను చదివి వినిపించాలి. సంఘటనను చదివేటప్పుడు పిల్లలకు అర్థమయ్యే రీతిలో చదవాలి లేదా చెప్పాలి పిల్లలు శ్రద్ధగా విన్నప్పుడే అందులో ఉండే అంశాలను గ్రహించగలుగుతారు. సంఘటన లేదా సన్నివేశం చదివి వినిపించిన తర్వాత పిల్లలను సంఘటనలో ఇచ్చిన అంశం పై ప్రశ్నలు అడిగి ప్రతి స్పందింప చేయాలి. అడిగే ప్రశ్నలు సూటిగా , స్పష్టంగా ఉండాలి. ఇలా పిల్లల చేత ఈవారం సంఘటనపై ప్రతి స్పందింప చేసి చివరి రెండు నిమిషాలు మౌన ప్రక్రియ చేయించాలి. మౌన ప్రక్రియ అనంతరం సెక్షన్ ముగించాలి.
– ఆనందవేదిక టీం.
భావోద్వేగాల నిర్వహణ (Managing Emotions)
ఉపకౌశలం: భావోద్వేగాన్ని నియంత్రించే తీరు (Dealing Emotions) వారం – 3
When we judge others, we contribute to violence – Marshall Rosenberg
ధ్యానప్రక్రియ : రోజు – 1
• ఉపాధ్యాయుడు ముందు పట్టికలో సూచించిన విధంగా ఏదైనా ఒక ధ్యానప్రక్రియను ఎంపికచేసి నిర్వహించవచ్చు.
ఉపోద్ఘాతము (Introduction):
భావోద్వేగాలు మన ప్రస్తుత పరిస్థితిని నిర్దేశించే ముఖ్యకారకాలు. “మనము భావోద్వేగ స్థితిలో ఏ విధంగా స్పందిస్తున్నాము ” అనే అంశమే మన సమర్థతను నిర్ణయిస్తుంది. మనకి, ఇతరులకి మధ్య సంబంధాలను మెరుగు పరుస్తుంది. మనల్ని మంచి పరిశీలకులుగా మారుస్తుంది.
సంఘటన :
కిరణ్ 8వ తరగతి చదువుతున్నాడు. ఒకసారి కిరణ్ తండ్రి, తన కారుని బయట గుమ్మం ముందు ఉంచి లోపల ఇంట్లో తన పనిలో నిమగ్నమై యున్నాడు. పని పూర్తిచేసుకొని బయటకు వెళ్ళాలని కారు వద్దకు వచ్చినపుడు తన కుమారుడు కారు
అద్దాల మీద ఏదో వ్రాయడం గమనిస్తాడు. తండ్రికి చాలా కోపం వస్తుంది. కొడుకుని పట్టుకొని చాలా గట్టిగా చేతుల పై కొడతాడు. దీని వలన కుమారుని చేతులు గాయపడతాయి. మరుసటిరోజు తండ్రి కారు అద్దంపై వ్రాసి ఉన్న అక్షరాలను చూసినపుడు “My Dad is my Hero అని వ్రాసి ఉండడం గమనించి ఎంతో కృంగిపోయాడు. పశ్చాత్తాపపడ్డాడు. కుమారుని కౌగిలించుకొని బాధపడతాడు.
ప్రతిస్పందనలు :
• కిరణ్ తండ్రికి ఎందుకు కోపమొచ్చింది ?
• మనకు కోపం వచ్చినపుడు మనం ఎలా ప్రవర్తిస్తాము ?
• కోపం వలన వచ్చే పరిణామాలేంటి ?
• మీరు నిత్యజీవితంలో ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్నారా?
ముగింపు (Check out):
చివరి రెండు లేదా మూడు ని||లు మౌనప్రక్రియ నిర్వహించాలి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});