Ananda Vedika Level 1, 2, 3, 4 Activities on 20th, 21st August, 2019 | AV 1st to 10th Class
AP Schools Conduct Ananda Vedika Level wise Activities on 20th and 21st August, 2019 | Level 1,2,3 and 4 for Primary Tsudents, Upper Primary Students and High School Students Ananda Vedika Activities download. Dr Manohar Rao Prepared Ananda Vedika Level wise Activities Download. 1-2-3-4 లెవెల్స్ వారు ఈక్రింది విధంగా కథాకార్యక్రమాన్ని అనుసరించాలి ఆనందవేదిక లో, పైన ఇచ్చిన సూచనలు పాటిస్తూ..ఆటలంతా ఆనందంగా..పాటలంతా కమణీయంగా జరిపే బాధ్యత ఉపాధ్యాయునిదే! ముందుగా 3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Ananda Vedika Level 1, 2, 3, 4 Activities on 20th, 21st August, 2019 | AV 1st to 10th Class
ఏకాగ్రతతో వినడం
సమయం : 25 నిమిషాలు నుండి 30 నిమిషాలు
ఉద్దేశ్యం :
విద్యార్థులు పరిసరాల ధ్వనుల పట్ల ఏకాగ్రత కలిగి ఉండి వాటిని గమనించడం.
శ్వాస మీద ధ్యాస :
• ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోమనాలి.
• శ్వాస మీద ధ్యాస కేంద్రీకృతం కాదు. మరలా మరలా శ్వాస మీద ధ్యాసను కేంద్రీకరించాలి.
కార్యాచరణ సోపానాలు :
• విద్యార్థులు ప్రశాంతంగా కూర్చొని పరిసరాల నుండి వచ్చే ధ్వనులను వినమనాలి.
• విద్యార్థులందరూ కళ్ళుమూసుకొని కూర్చోవాలి. పరిసరాల నుండి వచ్చే ధ్వనులను వినమనాలి. ఎవరికైనా కళ్ళు మూసుకోవడంలో ఇబ్బంది కలిగితే వారు క్రిందివైపు చూస్తూ కూర్చోమనాలి. కళ్ళు మూసుకున్న తర్వాత తరగతిలోకి వచ్చు విభిన్న ధ్వనులు విసమనాలి.
ఉదాహరణ : ఫ్యాను, ట్రాఫిక్, బయటవారి మాటలు, పిల్లల నవ్వులు, అల్లరి శబ్దాలు ప్రకృతి నుండివచ్చే శబ్దాలు మొదలైనవి.
• తమ ఏకాగ్రతను పరిసరాల నుంచి వచ్చు ధ్వనులపై నిలపాలి. వచ్చే ధ్వనులు మంచివైనా, చెడువైనా ఏదైనా వినాలని చెప్పాలి.
ఉపాధ్యాయుడు విద్యార్థులతో చర్చించవలసిన అంశాలు :
• ఈ ప్రక్రియ చేసే సందర్భంలో మీ అనుభవాలేమిటి ?
• మీరు మీ శ్వాస ధ్వనిని వినగలిగారా ?
• ఈ ప్రక్రియ చేయడం మనకు సులభంగానే అన్పించిందా ?
• ఎవరికైనా ఏకాగ్రత అంతరాయం కల్గిందా ?
గుర్తుంచుకోవలసిన అంశాలు:
• తమ పరిసరాల ధ్వనుల పట్ల ఏకాగ్రత నిలపాలి. తద్వారా విద్యార్థుల ధ్యాసను వినడంవైపు మళ్ళించవచ్చు.
మౌన ప్రక్రియ:
• మీరు ఏ ఏ ధ్వనులు విన్నారు ?
• 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యాన ప్రక్రియ కొనసాగించాలి.
• విద్యార్థులు కళ్ళు మూసుకుని ఉంటారా లేక కళ్ళు తెరచి క్రిందికి చూస్తారా అనేది వారి వారి ఇష్టానికి వదిలేయాలి. ఈ ప్రక్రియను మీ కుటుంబ సభ్యులతో కలసి చేయమనాలి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Download Ananda Vedika August 20, 21 – LEVEL-1,2.pdf
Download Ananda Vedika August 20,21 – LEV-3.pdf
Download Ananda Vedika August 20,21 – LVE-4.pdf