2DG Corona Medicine Price 990 – DRDO Developed Anti Corona Medicine Efficacy, Dosage : Covid Drug 2DG Prize – DRDO’s Covid-19 drug to be available for Rs 990, commercial launch in June 2021, The price of DRDO’s 2DG anti-COVID 19 drug has been fixed at Rs 990 per sachet by Dr Reddy’s lab. 2DG Corona Medicine released by DRDO – Anti Corona Medicine Efficacy, Price, Dosage. DRDO’s anti-covid drug 2 DG launched and Medicine Efficacy, Price, Dosage Details. DRDO 2DG Covid-19 medicine has been developed by DRDO’s Institute of Nuclear Medicine and Allied Sciences in collaboration with Hyderabad-based pharma giant Dr. Reddy’s Laboratories.
2DG Corona Medicine Price 990 – DRDO Developed Anti Corona Medicine Efficacy, Dosage
2 – DG Meaning is 2- Deoxy-D-Glucose. Misters on May 17 released the first batch of the indigenously developed anti-Covid-19 drug, 2-deoxy-D-glucose (2-DG). How 2-DG controls COVID-19? – The DRDO-developed 2 DG drug spreads through the body like glucose. It reaches the virus-infected cells and prevents virus growth by stopping viral synthesis and destroys the protein’s energy production. The drug also works on virus infection spread into lungs, which helps decrease patient’s dependability on oxygen.
How it works (2DG Medicine)
According to the government release, clinical trial data show that the molecule helps in faster recovery of patients hospitalised with Covid-19, and reduces their dependence on supplemental oxygen. 2DG Corona Medicine released by DRDO – Anti Corona Medicine Efficacy, Price, Dosage more details.
How to use 2DG Corona Medicine
The drug comes in powder form in sachet and is taken orally by dissolving it in water, the ministry said. In efficacy trends, the ministry said, patients treated with 2-DG showed faster symptomatic cure than the standard of care (SoC) on various endpoints.
2డీజీ సాచెట్ ధర రూ.990
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధం ధరను ఫిక్స్ చేశారు. 2డీజీ పౌడర్‌ను రూ.990కు అమ్మనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటళ్లకు మాత్రం డిస్కౌంట్ ధరలో 2డీజీ ఔషధాన్ని అందివ్వనున్నట్లు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కొన్ని రోజుల క్రితం ఈ పౌడర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే ఈ 2డీజీ ఔషధానికి అనుమతినిచ్చింది.
2-డీజీ పౌడర్ ఎలా యోగించాలి
- 2-డీజీ పౌడర్ రూపంలో ఉంటుంది. నీటిలో కలుపుకొని తాగాలి.
- కరోనా రోగుల చికిత్సకు ఇది సురక్షితమని, రోగులు దవాఖానల్లో చేరే అవకాశాల్ని తగ్గిస్తుందని, ఆక్సిజన్‌పై ఆధారపడుతూ చికిత్స తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధకులు తెలిపారు.
- ఈ ఔషధంలోని ఓ రకమైన సూడో గ్లూకోజ్ మాలిక్యూల్స్ వైరస్ తీవ్రతను తగ్గిస్తాయని వెల్లడించారు.
- 10వేల ప్యాకెట్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని గురువారం రాజ్‌నాథ్ తెలిపారు.
- సాచెట్ ధరను రూ.990గా రెడ్డి ల్యాబ్స్ ఫిక్స్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
DRDO: 2DG ఔషధం విడుదల
కొవిడ్ బాధితులకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. కరోనా చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన ‘2డీజీ (2-డియాక్సీ డి-గ్లూకోజ్)’ ఔషధం విడుదలైంది. దిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలి బ్యాచ్ 2డీజీ సాచెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు అందించారు. ఆరోగ్యమంత్రి వాటిని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు ఇచ్చారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. 2డీజీ ఔషధంతో కొవిడ్ రికవరీ సమయం తగ్గడంతో పాటు ఆక్సిజన్ అవసరం కూడా తగ్గుతుందని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరులో డీఆర్‌డీవో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న లాబొరేటరీ
తొలి విడతలో 10వేల సాచెట్లను అందుబాటులోకి తెచ్చారు. మే 27, 28 తేదీల్లో రెండో విడతలో భాగంగా మరిన్ని సాచెట్లను విడుదల చేస్తామని, జూన్ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది. అయితే దీని ధరను డీఆర్‌డీవో ఇంకా ప్రకటించలేదు. కొవిడ్ పోరులో ఈ ఔషధం అత్యవసర వినియోగానికి మే 1న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
కరోనా కట్టడి కోసం డీఆర్‌డీవో ఏడాది పాటు శ్రమించి ఈ ఔషధాన్ని తీసుకొచ్చింది. గతంలో దీన్ని క్యాన్సర్ కోసం తయారుచేశారు. శరీరంలో క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని అప్పట్లో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే సూత్రాన్ని కొవిడ్‌కు అన్వయించుకుని పరిశోధనలు ప్రారంభించారు. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్ వైరస్ కణాలకు గ్లూకోజ్ అందకపోతే కణ విభజన జరగదని, ఫలితంగా శరీరంలో కరోనా వ్యాప్తి కూడా ఆగుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.